గమనిక..అంతర్జాతీయ ప్రయాణాలపై యూఏఈ మార్గదర్శకాలు

- January 12, 2022 , by Maagulf
గమనిక..అంతర్జాతీయ ప్రయాణాలపై యూఏఈ మార్గదర్శకాలు

యూఏఈ: కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టి ప్రజలు తమ సాధారణ జీవితాలకు తెరిగి వస్తున్న తరుణంలో కోవిడ్ మరోసారి ఒమిక్రాన్ రూపంలో పంజా విసిరింది. దీంతో ప్రయాణాలపై ఆంక్షలు మళ్ళీ తలనొప్పి తెస్తున్నాయి.

యూఏఈ కు వచ్చే నివాసితులకు పీసీఆర్ టెస్టులు, GDRFA, ICA పర్మిట్లు వంటివాటిపై పలు మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వం. వాటిని ఇక్కడ పొందుపరచటం జరిగింది..

అబుధాబి వచ్చేవారికి..
ఎతిహాద్ ఎయిర్వేస్ విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా ప్రయాణానికి ముందు నివాసితులు స్మార్ట్ ట్రావెల్ సర్వీస్ 
https://smartservices.icp.gov.ae/echannels/web/client/guest/index.html#/registerArrivals లో రిజిస్టర్ అవ్వాలి.
1) వ్యాక్సినేషన్ నిబంధనలు:
వ్యాక్సిన్ రెండు డోసులు యూఏఈ లో తీసుకున్నట్లైతే, ప్రయాణించే ముందు ఎప్పుడైనా (ఫలానా వ్యవధి అనేది లేదు) తమ ప్రయాణాన్ని స్మార్ట్ ట్రావెల్ సర్వీస్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
అలాగే, వ్యాక్సినేషన్ తాలూకు సర్టిఫికెట్ ను ఇవ్వనక్కరలేదు. ఒకవేళ వ్యాక్సినేషన్ వేరే దేశంలో చేయించుకుంటే..ప్రయాణానికి సరిగా ఐదు రోజుల ముందు రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను జతపరచాలి. రిజిస్ట్రేషన్ తాలూకు కన్ఫర్మేషన్ QR కోడు మీ మెయిల్ కు వస్తుంది.
ఒకవేళ వ్యాక్సినేషన్ తీసుకోకపోతే, ప్రయాణించే ముందు ఎప్పుడైనా (ఫలానా వ్యవధి అనేది లేదు) తమ ప్రయాణాన్ని స్మార్ట్ ట్రావెల్ సర్వీస్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తాలూకు కన్ఫర్మేషన్ QR కోడు మీ మెయిల్ కు వస్తుంది.
2) పీసీఆర్ టెస్టు నిబంధనలు:
ప్రయాణీకులు తప్పనిసరిగా కోవిడ్ నెగటివ్ రిపోర్టును కలిగి ఉండాలి. మీరు ప్రయాణించే ఎయిర్లైన్స్ వారి నిబంధనలు సరి చూసుకోండి. ఇతిహాద్ ద్వారా ప్రయాణించేవారు అబుధాబి చేరుకునే 48 గంటల ముందు పీసీఆర్ టెస్టు చేయించుకొని ఉండాలి. భారత్ నుంచి వచ్చేవారు విమానం ఎక్కే ఆరు గంటల ముందు తీసుకున్న 'రాపిడ్ పీసీఆర్ టెస్ట్' నెగటివ్ రిపోర్టును చూపించాలి.
3) క్వారంటైన్ నిబంధనలు:
గ్రీన్ లిస్ట్ లోని దేశాల నుంచి వస్తున్నవారు..
వీరికి క్వారంటైన్ వర్తించదు. అబుధాబి ఎయిర్పోర్ట్ చేరుకోగానే పీసీఆర్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. అలాగే, అబుధాబి చేరుకున్న ఆరో రోజు మరలా పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి.
గ్రీన్ లిస్ట్ లో లేని దేశాల నుంచి వస్తున్నవారు..
వీరికి క్వారంటైన్ వర్తించదు. అబుధాబి ఎయిర్పోర్ట్ చేరుకోగానే పీసీఆర్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. అలాగే, అబుధాబి చేరుకున్న నాలుగో రోజు, ఎనిమిదో రోజు మరలా పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి.

దుబాయ్ వచ్చేవారికి..
ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా ప్రయాణానికి ముందు నివాసితులు స్మార్ట్ ట్రావెల్ సర్వీస్ లేదా లో రిజిస్టర్ చేసుకోనక్కరలేదు. అయితే, బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక మరియు సూడాన్ నుంచి వచ్చేవారు మాత్రం తప్పనిసరిగా తమ ప్రయాణాన్ని https://smart.gdrfad.gov.ae/Smart_OTCServicesPortal/ReturnPermitService.aspx లో రిజిస్టర్ చేయాలి. 
కొత్తగా జారీ చేయబడిన రెసిడెన్సీ/ఎంప్లాయిమెంట్ వీసాలకు, 10 ఏళ్ళ గోల్డెన్ వీసాలకు, ఇన్వెస్టర్/పార్టనర్ వీసాలకు, విసిట్ వీసాలకు ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
1) పీసీఆర్ టెస్టు నిబంధనలు:
ప్రయాణీకులు తప్పనిసరిగా కోవిడ్ నెగటివ్ రిపోర్టును కలిగి ఉండాలి. మీరు ప్రయాణించే ఎయిర్లైన్స్ వారి నిబంధనలు సరి చూసుకోండి. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ద్వారా ప్రయాణించేవారు దుబాయ్ చేరుకునే 48-72 గంటల ముందు పీసీఆర్ టెస్టు చేయించుకొని ఉండాలి. భారత్ నుంచి వచ్చేవారు విమానం ఎక్కే ఆరు గంటల ముందు తీసుకున్న 'రాపిడ్ పీసీఆర్ టెస్ట్' నెగటివ్ రిపోర్టును చూపించాలి.
2) క్వారంటైన్ నిబంధనలు:
యూకే నుంచి వస్తున్నవారు..
దుబాయ్ చేరుకునే 48 గంటల ముందు పీసీఆర్ టెస్టు చేయించుకొని ఉండాలి. నెగటివ్ రిపోర్టు చూపించాలి. రాపిడ్ పీసీఆర్ టెస్టు రిపోర్టు కూడా నెగటివ్ వచ్చి ఉండాలి అలాగే, ఆ రిపోర్టు లో మీరు పరీక్ష ఎక్కడ చేయుంచుకున్నారో ఆ సెంటర్ పేరు ఉండాలి. ఇహపోతే దుబాయ్ ఎయిర్పోర్ట్ చేరుకోగానే ప్రతిఒక్కరు పీసీఆర్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. రిపోర్టు ఫలితం వచ్చేవరకు హోమ్ క్వారంటైన్ లో ఉండాలి. 

షార్జా / రస్ అల్ ఖైమా వచ్చేవారికి..
ఎయిర్ అరేబియా ఎయిర్లైన్స్ విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా ప్రయాణానికి ముందు నివాసితులు స్మార్ట్ ట్రావెల్ సర్వీస్ లో రిజిస్టర్ అవ్వాలి.
1) పీసీఆర్ టెస్టు నిబంధనలు:
ప్రయాణీకులు తప్పనిసరిగా కోవిడ్ నెగటివ్ రిపోర్టును కలిగి ఉండాలి. మీరు ప్రయాణించే ఎయిర్లైన్స్ వారి నిబంధనలు సరి చూసుకోండి. ఎయిర్ అరేబియా ద్వారా ప్రయాణించేవారు షార్జా / రస్ అల్ ఖైమా చేరుకునే 48 గంటల ముందు పీసీఆర్ టెస్టు చేయించుకొని ఉండాలి. భారత్ నుంచి వచ్చేవారు విమానం ఎక్కే ఆరు గంటల ముందు తీసుకున్న 'రాపిడ్ పీసీఆర్ టెస్ట్' నెగటివ్ రిపోర్టును చూపించాలి. 16 ఏళ్ళ లోపు వయసుగల పిల్లలు ఈ పరీక్షలు నుంచి మినహాయింపు.
2) క్వారంటైన్ నిబంధనలు:
ఎయిర్పోర్ట్ చేరుకోగానే ప్రతిఒక్కరు పీసీఆర్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. రిపోర్టు ఫలితం వచ్చేవరకు హోమ్ క్వారంటైన్ లో ఉండాలి. 12 ఏళ్ళ లోపు వయసుగల పిల్లలు ఈ పరీక్షలు నుంచి మినహాయింపు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com