రోజురోజుకి పెరుగుతున్న మృతుల సంఖ్య : ఇరాక్
- March 26, 2016
ఇరాక్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించింది. శుక్రవారం ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని సాకర్ మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఇరాక్‌లోని అల్‌అసద్ మిలిటరీ స్థావరంపై శనివారం ఐఎస్ ఆత్మాహుతి దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ముగ్గురు ఇరాకీ సైనికులు మృతిచెందారు. మిలిటరీ స్థావరంలో వందమందిపైగా సంకీర్ణ సలహాదారులు సమావేశమైన సమయంలో దాడులు చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. నలుగురు ఐఎస్ ఆత్మాహుతి సభ్యులు దాడులకు ప్రయత్నించారని, తమను తాము పేల్చుకోవడంతో ముగ్గురు ఇరాకీ సైనికులు మృతిచెందారని అల్‌జజీరా ఆపరేషన్స్ కమాండ్ మేజర్ జనరల్ అలీ ఇబ్రహిం డబౌన్ తెలిపారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







