దాడులకు పాల్పడింది తామేనని ఐఎస్ ఉగ్రవాద సంస్థ : యెమెన్
- March 26, 2016
యెమెన్‌లోని ఆడెన్ నగరంలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో 26మంది మృతి చెందగా, మరికొంతమంది గాయపడ్డారు. వీరిలో 10 మంది సాధారణ పౌరులుకాగా, 16 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అంతర్యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ దాడులకు తెగబడినట్ట్టు సమాచారం. శుక్రవారం బురైఖా ప్రాంతంలోని చెక్‌పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా పేలుడు పదార్థాలతో వచ్చిన ఓ అంబులెన్సును గుర్తించారు. అంబులెన్స్ డోర్ తెరిచేలోపే అందులో ఉన్న వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు.ఈ ఘటనలో 14 మంది మృతిచెందారు. మరికొద్దిసేపటికే చెక్‌పాయింట్ సమీపంలో మరో రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో 12మంది మృతిచెందగా, పలువురు గాయపడినట్టు అధికారులు వెల్లడించారు.-కిడ్నాప్ అయిన కేరళవాసిని విడిపించేందుకు చర్యలుఈనెల 4న యెమెన్‌లో ఉగ్రవాదులు అపహరించారని భావిస్తున్న కేరళకు చెందిన ఫాదర్ ఉజున్నలిల్‌ను విడిపించేందుకు కృషి చేస్తున్నట్టు భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా ఉజున్నలిల్‌ను చంపేందుకు ఉగ్రవాదులు పథకం వేసుకున్నారని, అయితే అందుకు సంబంధించిన ఎలాంటి సమాచారం తమకు అందలేదన్నారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







