అబుధాబిలో Dhs 5 మిలియన్ పరిహారం కోరిన కార్మికుడు

- January 16, 2022 , by Maagulf
అబుధాబిలో Dhs 5 మిలియన్ పరిహారం కోరిన కార్మికుడు

అబుధాబి: ఒక కార్మికుడు తనకు జరిగిన భౌతిక, నైతిక నష్టాలకు పరిహారంగా Dhs 5 మిలియన్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.తాజాగా అబుధాబి కోర్ట్ ఆఫ్ కాసేషన్ కేసు తిరస్కరణను కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ సమర్థించింది. తాను పని చేసే కంపెనీ కారణంగా తనకు శరీర గాయం అయిందని, దాంతో కోల్పోయిన ఆదాయానికి పరిహారంగా తనకు Dhs3,500,000 (Dhs3.5 మిలియన్లు) చెల్లించాలని కార్మికుడు తన కంపెనీని డిమాండ్ చేస్తూ దావా వేశాడు. ఆక్సియాసిటిలీన్ ఉపయోగించి ఎలక్ట్రికల్ పద్ధతిలో లోహాలను వెల్డింగ్ చేయడానికి మెయింటెనెన్స్ టెక్నీషియన్‌గా పనిలో చేరానని, పనిప్రాంతంలో ఆరోగ్యకరమైన, భద్రతా పరమైన జాగ్రత్తలు లేకపోవడం వల్ల తనకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తోపాటు కటి వెన్నుపూస దెబ్బతిన్నదని, దీంతో తాను కదలడంలో ఇబ్బందులు వస్తున్నాయని కార్మికుడు తన పిటిషన్ లో పేర్కొన్నాడు. మొదటి కోర్టు దావాను తిరస్కరించింది. దరఖాస్తుదారు తీర్పుపై అప్పీల్ చేసారు. అప్పీల్ కోర్ట్ సైతం దానిని తిరస్కరించింది.అతను కాసేషన్ కోర్టుకు అప్పీల్ చేసాడు. తాజాగా అది కూడా దాన్ని తిరస్కరించింది. కార్మికుడి దావాను సమీక్షించడానికి ముగ్గురు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీని గతంలో కోర్టు నియమించింది. విచారణ జరిపిన కమిటీ కంపెనీ తప్పు లేదని, దరఖాస్తుదారుకు క్యాన్సర్ కణితి ఉన్నట్లు నిర్ధారణ కాలేదని ధృవీకరించింది. అతనికి చికిత్సను నిర్ణయించడానికి దరఖాస్తుదారు ఫైల్ ఆంకాలజీ కమిటీకి బదిలీ చేయబడిందని కమిటీ సూచించింది. ఆంకాలజీ కమిటీ సైతం అతని వెన్నెముక సమస్య సాధారణమైనదని దానికి పరీక్షలు లేదా చికిత్స అవసరం లేదని స్పష్టం చేసింది. ఇవన్నీ పరిశీలించిన కోర్టు లేబర్ పరిహారం పిటిషన్ ను కొట్టివేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com