కాసినోపై సీఎం జగన్ నోరు విప్పాలి:చంద్రబాబు నాయుడు

- January 24, 2022 , by Maagulf
కాసినోపై సీఎం జగన్ నోరు విప్పాలి:చంద్రబాబు నాయుడు

అమరావతి: ఏపీలో కాసినో రగడ ఇంకా కంటిన్యూ అవుతోంది. మంత్రి కొడాలి నానిపై టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. దీనికి ప్రతిగా కొడాలి నాని సవాల్ విసురుతున్నారు. దీంతో ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోతున్నాయి. తాను సవాల్ విసిరింది టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడికని మంత్రి కొడాలి నాని పేర్కొన్న సంగతి తెలిసిందే.దీనిపై 2022, జనవరి 24వ తేదీ సోమవారం చంద్రబాబు రియాక్ట్ అయ్యాురు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

సీఎంల లిస్ట్ లో టాప్ 20లో ఏపీ సీఎం జగన్ కనిపించలేదని, గ్యాంబ్లింగ్ పై సమాధానం లేకనే మంత్రి కొడాలి నాని బుకాయింపులు, బూటకపు మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాసినో వంటి విష సంస్కృతిపై పోరాటం కంటిన్యూ చెయ్యాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయంలో వివిధ జాతీయ ఏజెన్సీలకు, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చెయ్యాలని డిసైడ్ అయ్యారు. చిత్తూరు జిల్లాలో పోలీసు కస్టడీలో దళిత మహిళను చిత్రహింసలకు గురిచేయడాన్ని నేతలు ఖండించారు. ఉద్యోగులపై సోషల్ మీడియాలో, మీడియాలో తప్పుడు ప్రచారం చేయించడం ప్రభుత్వ నైజాన్ని తెలుపుతుందని వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com