బెల్ లో ఉద్యోగాలు...
- January 24, 2022
బెంగుళూరు: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 247 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీలకు వివరాలకు సంబంధించి ప్రాజెక్ట్ ఇంజినీర్లు 67, ట్రెయినీ ఇంజినీర్లు 169, ఫైనాన్స్ ట్రెయినీ ఆఫీసర్లు 11 ఖాళీలు ఉన్నాయి.
ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ , సివిల్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత కు సంబంధించి స్పెషలైజేషన్ లో కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ, బీఆర్క్, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు జనవరి 1, 2022 నాటికి 28 నుండి 32 ఏళ్లకు మించరాదు.
కనీసం ఆరుమాసాల పని అనుభవం కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి నెలకు 30,000రూ నుండి 55,000రూ వరకు వేతనం చెల్లిస్తారు. అకడమిక్ మెరిట్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 4, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ http://www.bel-india.in లో చూడగలరు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







