తెలుగు అసోసియేషన్ నిర్వహించిన రక్తదాన శిబిరం..
- January 25, 2022
దుబాయ్:యూఏఈ లోని తెలుగు అసోసియేషన్,దుబాయ్ లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. పలువురు సభ్యులు రక్తదానం చేయటానికి ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.తెలుగు అసోసియేషన్ చైర్మన్ వుగ్గిన దినేష్ కుమార్ మాట్లాడుతూ “యూఏఈ లోని పజ్రల దరికిచేరటం మరియు వారిలో మమేకమవటం మా లక్ష్యం..సామాజిక సేవలో మా ప్రయత్నాలను నిరంతరం మెరుగుపరుస్తాము" అని అన్నారు.
బర్-దుబాయ్ లో విజయవంతంగా సాగిన ఈ రక్తదాన కార్యక్రమం..దుబాయ్ హెల్త్ అథారిటీ(DHA) సిబ్బంది సమక్షంలో కోవిడ్ కి సంబంధించిన అన్ని భదత్రా నియమాలను పాటిస్తూ, మొబైల్ క్లినిక్ వాహనములో నిర్వహించటం జరిగింది.అసోసియేషన్ సభ్యులందరినీ సమన్వయ పరచుటలో బలుస వివేకానంద్ (పధ్రాన కార్యదర్శి) మరియు వుట్నూరి రవి(సామాజిక సేవా విభాగ సంచాలకులు) తగు కృషి చేసారు.
ఈ కార్యక్రమంలో ఔత్సాహికులతో పాటు వ్యవస్ఠాపక సభ్యులైన చింతకాయల రాజీవ్,ఎండూరి శ్రీనివాస్ మరియు సబ్ కమిటీ సభ్యులు పాల్గొని రక్తదానం చేసారు.

తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







