ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- July 07, 2026
దోహా: ప్రజల్లో అధిక చక్కెర వినియోగాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ఖతార్ ప్రభుత్వం చక్కెర కలిపిన పానీయాలపై కొత్త ఎక్సైజ్ పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. జూలై 6నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానాన్ని జనరల్ ట్యాక్స్ అథారిటీ (GTA) ప్రకటించింది. డ్రింక్స్ లో ఉన్న చక్కెర లేదా అదనంగా కలిపిన స్వీటెనర్ల పరిమాణాన్ని బట్టి ఎక్సైజ్ పన్ను నిర్ణయిస్తారు. ఈ మేరకు ఎక్సైజ్ పన్ను చట్టంలో సవరణలు చేసి పన్ను పరిధిని విస్తరించారు. దీంతో అదనపు చక్కెర కలిగిన కూల్ డ్రింక్స్, జ్యూసులు, అలాగే వాటి తయారీలో ఉపయోగించే కాన్సన్ట్రేట్లు, పొడులు, ఎక్స్‌ట్రాక్టులు తదితర ఉత్పత్తులు కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చాయి.
అయితే, ప్రస్తుతం ఎక్సైజ్ వస్తువులను నిల్వ ఉంచిన వ్యాపారులు, సంస్థలు తమ వద్ద ఉన్న నిల్వలను ధరీబా (Dhareeba) పోర్టల్ ద్వారా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే పన్ను నిర్ణయించడంలో స్టాక్ పరిమాణమే ప్రమాణం కాదని GTA స్పష్టం చేసింది. డ్రింక్స్ లో ఉన్న చక్కెర లేదా అదనపు స్వీటెనర్ల స్థాయినే పరిగణనలోకి తీసుకుంటారని తెలిపింది. పన్ను చెల్లింపుదారులు జూలై 6నుంచి 90 రోజుల్లోపు ధరీబా పోర్టల్ ద్వారా పన్ను రిటర్న్ దాఖలు చేయాలి. రిటర్న్ సమర్పించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు పన్ను చెల్లించాలని అథారిటీ సూచించింది.
అలాగే సీల్ చేసిన ప్యాకేజింగ్‌లో విక్రయించే పానీయాలకు మాత్రమే ఈ ఎక్సైజ్ పన్ను వర్తిస్తుంది. రెస్టారెంట్లు, కేఫేలు వంటి చోట్ల వెంటనే వినియోగం కోసం తయారు చేసి, ప్యాకేజింగ్ లేకుండా అందించే పానీయాలకు ఈ పన్ను వర్తించదని జనరల్ ట్యాక్స్ అథారిటీ క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







