మక్కాలోని మురికివాడల అభివృద్ధి

- January 27, 2022 , by Maagulf
మక్కాలోని మురికివాడల అభివృద్ధి

మక్కా: మక్కాలో మిగిలిపోయిన కొన్ని మురికి వాడల్ని పూర్తి  స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు మక్కా డెవలప్మెంట్ అథారిటీస్ పేర్కొన్నాయి. మక్కా పరిసరాల్లో ఇంకా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్ని అభివృద్ధి చేయడం ద్వారా మక్కా ఖ్యాతిని మరింత పెంచుతామని అథారిటీస్ వెల్లడించాయి. అభివృద్ధికి ముందు ఆయా ప్రాంతాల్లో భవనాల్ని పూర్తి స్థాయిలో ఖాళీ చేయించి, పడగొడ్తారు. ఆ తర్వాత పద్ధతి ప్రకారం వాటిని సర్వాంగ సుందరంగా పునర్ నిర్మిస్తారు. పెద్ద సంఖ్యలో రెసిడెన్సీ ఉల్లంఘనులు ఈ ప్రాంతాల్లో నివసిస్తుండగా, ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి, వారిని అరెస్టు చేయడం జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com