అమెరికా వెళ్ళేవారికి శుభవార్త...
- January 30, 2022
అమెరికా: అమెరికా వెళ్ళాలని, అక్కడ ఉన్నతోద్యోగం చేయాలని భావించే యువత ఎక్కువయ్యారు.వివిధ కారణాల హెచ్ 1 బీ వీసాల జారీ ఆలస్యం అవుతోంది. తాజాగా బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఉపాధి పొందాలంటే హెచ్1బీ వీసా తప్పనిసరి కావడంతో ఆ వీసాలు జారీచేయాలని అమెరికా భావిస్తోంది. ఏటా 65 వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తుంటుంది. తాజాగా 2023 ఆర్థిక సంవత్సరం కోసం హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.
మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ఇమ్మిగ్రేషన్ విభాగం తెలిపింది. ఆన్ లైన్ లో myUSICS పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించింది.రిజిస్ట్రేషన్ దరఖాస్తు సమయంలో 10 డాలర్ల రుసుం చెల్లించాలి. రిజిస్ట్రేషన్లకు మార్చి 18 ఆఖరు తేదీ. గడువులోపల దరఖాస్తు చేసుకున్నవారికి ర్యాండమ్ పద్ధతిలో హెచ్1బీ వీసాలు కేటాయిస్తారు. ఈసారి వీసాలు పొందేవారు అక్టోబరు నుంచి అమెరికాలో ఉద్యోగంలో చేరవచ్చు.హెచ్ 1 బీ వీసా తీసుకుని అమెరికాలో అడుగుపెట్టేవారిలో అత్యధికులు భారతీయులే కావడం విశేషం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







