బింబిసార రెండవ పార్ట్‌లో ఎన్టీఆర్
- February 02, 2022
హైదరాబాద్: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. నందమూరి అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కళ్యాణ్ రామ్ బార్బేరియన్ కింగ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సెకెండ్ పార్ట్ కూడా త్వరలో సిద్ధం అవుతోంది.
త్వరలో సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేయబోతుండగా.. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. వసిష్ట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోండగా.. ఈ సినిమా తర్వాత వశిష్ట్ బాలయ్యతో అల్లు అర్జున్ నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న బింబిసార మూవీలో క్యాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. గౌతమీ పుత్ర శాతకర్ణి ఫేమ్ చిరంతన్ భట్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి బింబిసారుడు కథే ఈ సినిమా కథాంశం.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!







