పెద్ద హీరోల పై 'ఆర్.జి.వి' సంచలన వ్యాఖ్యలు
- June 09, 2015
ఛార్మి ప్రధాన పాత్రలో 'జ్యోతి లక్ష్మీ' సినిమాను జూన్ 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన గురువైన రామ్ గోపాల్ వర్మకు స్పెషల్ షో చూపించారు పూరి జగన్నాథ్.'జ్యోతి లక్ష్మీ' సినిమాలో హీరోయిన్ చార్మి పెర్ఫార్మెన్స్ చూసి ముగ్దుడైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు.'జ్యోతి లక్ష్మీ' సినిమా చూసాను. మెసేజ్ అండ్ బ్యూటీ పర్ ఫెక్ట్‌గా మిక్స్ చేసి తీసారు. దాంతో పాటు ఎంటర్టెన్మెంట్ కూడా అదిరిపోయింది.చార్మి పెర్పార్మెన్స్ సూపర్. జగన్ చార్మిని చాలా బాగా చూపించాడు. పంచ్ లైన్స్, టెక్నికల్ స్టైలైజేషన్ బావుంది. చార్మి లుక్ చాలా హీరోయిక్ గా ఉంది. రియల్ ఎమోషన్స్.ఫేక్ హీరోయిజం అసలే లేదు.చాలా మంది పెద్ద హీరోల కంటే ఆమె బెటర్ అంటూ కామెంట్ చేసారు. ఛార్మి కౌర్ ప్రధాన పాత్రలో ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ బ్యానర్స్ పై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్, తేజ్, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'జ్యోతి లక్ష్మీ'. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఛార్మి హీరోయిన్గా 'జ్యోతి లక్ష్మీ' పేరుతో సినిమా చెయ్యబోతున్నామని దర్శకనిర్మాతలు ఎనౌన్స్ చెయ్యడంతోనే ఈ సినిమా మీద అందరికీ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసారో ఆడియన్స్ లో అప్పటి వరకు ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ రెట్టింపు అయ్యాయి. బిజినెస్ పరంగా కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమాగా 'జ్యోతి లక్ష్మీ' చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 12న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఛార్మి కౌర్, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్ కశ్యప్, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్, తేజ,సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







