'సర్దార్ గబ్బర్‌సింగ్' మూవీ టిక్కెట్స్ కావాలా?
- March 29, 2016
పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. పవన్‌కళ్యాణ్ సినిమాకి ఫస్ట్ డే టిక్కెట్ సంపాదించడం అంత వీజీ కాదు. కానీ 'మా గల్ఫ్ డాట్ కామ్' మీకు ఆ అవకాశం కల్పిస్తోంది. పది మంది లక్కీ విన్నర్స్ 'సర్దార్ గబ్బర్‌సింగ్' తొలి రోజు టిక్కెట్లను పొందే అవకాశం ఉంది. దానికి మీరు చెయ్యాల్సిందల్లా సింపుల్. పవన్‌కళ్యాణ్ మీద మీ అభిమానం చాటుకోండి. అదెలాగంటే, 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా టైటిల్‌కి మంచి క్యాప్షన్ ఆలోచించి మాకు పంపించండి. అలా వచ్చిన క్యాప్షన్స్‌లో ఐదింటిని సెలక్ట్ చేసి, ఒక్కొక్క క్యాప్షన్కీ ఒక్కొక్క టిక్కెట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే, 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమాలో పవన్‌కళ్యాణ్ ఎలాంటి డైలాగ్స్ చెబితే బావుంటుందో మీరు ఊహించి మాకు పంపించడం. డైలాగ్‌లో పవన్‌కళ్యాణ్ మార్క్ పంచ్‌లు ఉండడం తప్పనిసరి. ఒక్కో మంచి డైలాగ్‌కీ ఒక్కో టిక్కెట్ ఇవ్వబడ్తుంది. ఇంకెందుకు ఆలస్యం, డైలాగ్ రాయండి లేదా క్యాప్షన్ పెట్టండి, సర్దార్ గబ్బర్‌సింగ్ టిక్కెట్ సొంతం చేస్కోండి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







