అల్ తుమ్మ కూడలి తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపు
- March 30, 2016
అల్ తుమ్మ కూడలి పనులు పూర్తి చేయడానికి ఇ-రింగ్ వద్ద నజ్మా రోడ్లు అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా చివరి తారు పొర చేయడానికి, పబ్లిక్ వర్క్స్ అథారిటీ 'ఆశ్ఘల్ ' ఎనిమిది దశల్లో ఒక తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపు అమలు చేయనుంది.మొదటి దశ పనులు అర్ధరాత్రి తర్వాత గురువారం నాడు మొదలై శనివారం ఉదయం 5 వరకు కోనసాగుతుంది. మిగిలిన ఏడు దశల్లో ప్రతివారం గురువారం అర్ధరాత్రి నుంచి శనివారం 5 గంటలకు ఒకో దశ పూర్తికానుంది. ఈ పనులు ఏడు వారాంతాలలో నిర్వహించనున్నారు. ఈ పనులకు చివరి దశ మే 21 నాటికి పూర్తవుతుందని అంచనా వెయ్యబడింది.ప్రతి దశలో, కూడలి యొక్క ఒక భాగం మాత్రమే మూసివేయబడతాయి మరియు చిహ్నాలు పటంలో చూపిన విధంగా ఎక్కడ మూసి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా రహదారి తెరవబడిన భాగాలను అందులో సూచిస్తుంది ఆ విధంగా బోర్డు ఏర్పాటుచేస్తారు . కూడలి చివరి దశ పనులు సమీపించేసరికి రెండు రోజులు మినహా అక్కడ పూర్తి మూసివేత అవసరం ఉంటుంది.ఆశ్ఘల్ లో, వాహనదారులు రహదారి మళ్లింపు సలహా చిహ్నాలను ఏర్పాటుచేయనున్నారు . వేగ పరిమితులు కట్టుబడి ఉండాలని భద్రత చర్యలు నిర్ధారించడానికి రహదారి చిహ్నాలను అనుసరించండని అధికారకంగా రహదారి వినియోగదారులను ఈ సందర్భంగా అభ్యర్థించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







