మూడు దేశాల పర్యటనలో బ్రసెల్స్ చేరుకున్న మోదీ
- March 29, 2016
భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా బుధవారం బెల్జియం రాజధాని బ్రసెల్స్ చేరుకున్నారు. బెల్జియం ప్రధానమంత్రి ఛార్లెస్ మిషెల్‌తో జరిపే ద్వైపాక్షిక చర్చల్లో నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. అలాగే బ్రసెల్స్‌లో జరగనున్న 13వ ఇండియన్ - యూరోపియన్ యూనియన్ సదస్సుకు కూడా మోదీ హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. మార్చి 31వ తేదీన ప్రధాని మోదీ బెల్జియం నుంచి వాషింగ్టన్ చేరుకుంటారు. రెండు రోజుల పాటు జరగనున్న నాలుగో అణు భద్రత సదస్సు (న్యూక్లియర్ సెక్యూరిటీ సమిట్ )లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధ్యక్షత వహించనున్న సంగతి తెలిసిందే.వాషింగ్టన్ నుంచి తిరుగు ప్రయాణంలో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. అందులోభాగంగా ఏప్రిల్ 1వ తేదీన రియాద్ లో దిగుతారు. పలు కీలక చర్చల్లో మోదీ పాల్గొన్నున్నారు. ఏప్రిల్ 3వ తేదీన భారత్ కు మోదీ తిరుగు ప్రయాణం అవుతారు
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







