చైనాకు భారత్ మరోసారి షాక్...
- February 14, 2022
న్యూఢిల్లీ: చైనాకు భారత్ మరోసారి షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన 54 యాప్‌లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా పాప్యులర్ యాప్‌లు స్వీట్ సెల్ఫీ హెడ్, బ్యూటీ కెమెరా-సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ జీవర్, ఒన్‌మోజీ ఎరినా, యాప్ లాక్ వంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా ఆ యాప్‌లు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ 54 యాప్‌లు చాలా ముఖ్యమైన డేటా అనుమతులు అడుగుతూ సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఆ యాప్‌లు రియల్ టైమ్ డేటాను తీసుకుంటున్నాయని ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని చెప్పాయి. కాగా, గత ఏడాది జూన్‌లో చైనాకు చెందిన 59 యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. వాటిల్లో టిక్ టాక్, వీచాట్, హలో వంటి పాప్యులర్ యాప్‌లు కూడా ఉన్నాయి. చైనాకు చెందిన వేలాది యాప్‌లలో అతి ముఖ్యమైన యాప్‌లను భారత్ నిషేధిస్తోంది.వాటి ద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండడంతో 2020 నుంచి ఇప్పటి వరకు మొత్తం 300 యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!







