'#69 సంస్కార్ కాలనీ' మార్చ్ 4న విడుదల

- February 15, 2022 , by Maagulf
\'#69 సంస్కార్ కాలనీ\'  మార్చ్ 4న విడుదల

హైదరాబాద్: లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా పతాకంపై ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో బి బాపిరాజు, ముతికి నాగ సత్య నారాయణ సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం "#69 సంస్కార్ కాలనీ. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మార్చ్ 4న విడుదలకు సిద్ధమైంది. వాలెంటైన్స్ డే సందర్భంగా చిత్ర యూనిట్  ట్రైలర్ ను పాత్రికేయుల సమావేశంలో విడుదల చేశారు..ఈ సందర్భంగా .. 

చిత్ర హీరోయిన్ ఎస్తర్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఎమోషనల్ గా నా హార్ట్ కు దగ్గరగా ఉంది. నేను చేసిన సినిమాలు తక్కువే అయినా తెలుగు ప్రేక్షకులు నన్నెంతో ఆదరించడం తో నాకు మంచి గుర్తింపు లభించింది. తెలుగు ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమను నేనెప్పుడూ మరచిపోలేను. ఆ తరువాత మంచి సినిమా చెయ్యాలి అనుకుంటున్న టైం లో సునీల్ కుమార్ గారు ఈ కథ చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంట్రెస్టింగా  అనిపించింది. ఇది ఫాంటసీ గానో , ఇమాజినేషన్  గానో కాకుండా ఉండే  స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమా. ప్రస్తుతం సొసైటీలో రిలేషన్ షిప్ అనేది చాలా కాంప్లికేటెడ్ అయ్యింది. ఇప్పుడు మనము బ్రతుకు తున్న లైఫ్ కూడా చాలా  కాంప్లికేటెడ్. అలాంటిది సొసైటీ లో జరుగుతున్న చాలా విషయాల్లో లో హ్యుమాన్ రిలేషన్ షిప్ ఒకటి. ఇలాంటి పరిస్థితులు  చాలా మంది లైఫ్ లలో ఎదురవుతూ ఉంటాయి. . ఇలాంటి స్విచ్వేషన్ ఉన్న కథను మంచి కథనం తో తయారు చేయడం జరిగింది. ఈ కథ చాలా ఇంట్రెస్ట్ గా ఉండడమే కాకుండా  ఆడియన్స్ కుడా చాలా ఏంటర్ టైన్ అవుతారు. తెలుగు ఆడియన్స్ కు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని అన్నారు. 

రిశ్వి తిమ్మరాజు మాట్లాడుతూ..  నాకు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు మరియు స్వాతి గార్లకు ధన్యవాదాలు..నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. మా మూవీ లో  కామెడీ, ఫన్, రొమాన్స్ ఇలా అన్ని రకాల ఏమోషన్స్ ఉంటాయి. మార్చ్ 4న విడుదల అవుతుంది.  గొప్ప విజయం సాధిస్తుంది అని అన్నారు. 

ఎడిటర్ కృష్ణ మాట్లాడుతూ.. 
సమాజంలో  జరుగు తున్నకొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్స్ ని  దృష్టిలో పెట్టుకుని మంచి సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకొని  ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మంచి విజయం సాధిస్తుంది అన్న ఆశాభావం వ్యక్తం చేసారు.


లిరిక్ రైటర్ గమన్ శ్రీ మాట్లాడుతూ.. స్వాతి గారు ఇచ్చిన ఈ మంచి కథను సునీల్ కుమార్ రెడ్డి గారు వాస్తవిక సంఘటనల ఆధారంగా సమాజానికి మెసేజ్ ఇస్తూ చాలా చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు. 

చిత్ర నిర్మాత బాపిరాజు గారు మాట్లాడుతూ.. #69 సినిమా చేసిన సునీల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సునీల్ గారు కంటెంట్ ఉన్న కథలను చేయడానికి మాత్రమే ఇష్టపడతారు. గంగపుత్రులు, సొంత ఊరు, గల్ఫ్ లాంటి  సినిమాలు మాత్రమే కాదు రొమాంటిక్ అంశాలు ఉన్న చిత్రాలను సైతం గతం లో తీసి మెప్పు పొందారు. కేవలం యువతని ఆకర్షించడానికి మాత్రమే కాకుండా కధకు ఉన్న అవసరం బట్టి బోల్డ్ గా చిత్రీకరించడానికి వెనుకాడని దర్శకుడు అతను.. ఈ కధను తను కుడా ప్రేమించి యువతకి నచేలా తీర్చిదిద్ది మాకు అందించినందుకు దన్యవాదములు. అలాగే మా భీమవరం బుల్లెమ్మ ఎస్తర్ చాలా మంచి మనసున్న మనిషి. ప్రతి ఫ్రేమ్ లో అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది.   సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఫుల్ సపోర్ట్  చేసింది. తను మూడు సినిమాలు చేస్తున్నా కూడా మా సినిమా ప్రమోషన్స్ కి వచ్చి మాకు సపోర్ట్ చేస్తుంది. ఆమెకు మా కృతజ్ఞతలు. మాకు సపోర్ట్ గా నిలిచిన ముతికి నాగ సత్యనారాయణ కు ధన్యవాదాలు. గతంలో మా 12 సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన ప్రవీణ్ గారు ఆ చిత్రానికి కుడా మంచి మ్యూజిక్ ఇచ్చారు.శివరాం గారు, అద్భుతమైన కెమెరా ఫుటేజ్ ఇచ్చారు. డీఐ చేసిన పురుషోత్తం గారికి సౌండ్ మిక్సింగ్ చేసిన విష్ణు  గారి కి  నా ధన్యవాదాలు. గమన్ శ్రీ, యక్కలి  రవీంద్ర బాబు లు మంచి పాటలు రాశారు.నటీనటులు టెక్నీషియన్లు అందరూ చాలా సపోర్ట్ చేసిన సినిమా చాలా బాగా వచ్చింది.  మార్చి 4న వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని  కోరుతున్నాను అన్నారు 

చిత్ర దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కమర్షియల్ పాయింట్ అనే కాకుండా సోషల్ ఎసెన్స్ ఉండాలనే ఉద్దేశం తో ఈ స్టోరీని డెవలప్ చేసి. పత్రాలు నిజజీవితానికి దగ్గరగా ఉండే విధం గా తీర్చిదిద్దిన తరువాతే  షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఫ్రెమ్ ఎంతో ఇష్టంగా చాలా చక్కగా వచ్చేలా సహకరించిన నా టీం కి . దానికి సహకరించిన ఆర్టిస్టులకు ధన్యవాదాలు . ప్రతి పాత్రలో కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి  . త్వరలో వైశాలి కి సంబంధించిన మల్టిపుల్ డైమెన్షన్…ఉన్న  లుక్ ను రిలీజ్ చేస్తున్నాము. డెఫినెట్ గా ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని నమ్ముతున్నాను . మార్చి 4న వస్తున్న ఈ సినిమాకు మీ అందరి సహాయ సహకారాలు వుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. 

నటీనటులు
ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్, భద్రం,శిల్పా నాయక్  ,రామన్, Fm బాబాయ్,సముద్రం వెంకటేష్ తదితరులు 

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : లక్ష్మీ పిక్చర్స్
డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : పి.సునీల్ కుమార్ రెడ్డి 
ప్రొడ్యూసర్స్ : బి బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ
 స్టోరీ : గాయత్రీ స్వాతి మంత్రిప్రగడ 
మ్యూజిక్ : ప్రవీణ్ ఇమ్మడి 
డి ఓ పి : ఎస్ వి శివరాం 
ఎడిటర్ : కృష్ణ మండల 
లిరిక్స్ : గమన్ శ్రీ ,యక్కలి  రవీంద్రబాబు 
సింగర్స్ : ఎస్తర్, శ్రీ ప్రసన్న , శ్రీనివాస్ యాదవ్ 
విఎఫ్ఎక్స్ : శ్యామ్ కుమార్ పి 
కలరిస్ట్  : పురుషోత్తం 
సౌండ్ ఇంజనీర్ : విష్ణువర్ధన్ కాగిత
పి ఆర్ ఓ : పాల్ పవన్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com