డోర్ టు డోర్ కార్గో సర్వీసు రుసుము పెంపు
- March 30, 2016
ఒమన్ నుంచి ఇండియాకి డోర్ టు డోర్ కార్గో సర్వీసులను నడుపుతున్న కార్గో ఏజెంట్స్ ఛార్జీలను పెంచారు. మస్కట్ మరియు న్యూ ఢిల్లీ మధ్య ఒక కిలో కార్గోకి 100 బైసాస్ నుండి 1.3 ఒమన్ రియాల్స్‌కి ఛారీజని పెంచారు. మస్కట్‌లో సమావేశమైన 35 మంది ఏజెంట్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వరకు మాత్రమే కార్గోను అనుమతిస్తారు. అక్కడినుంచి కార్గో ఏజెంట్స్ దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. మస్కట్ ఎయిర్‌పోర్ట్ వద్ద కార్గో హ్యాండ్లింగ్ ఛార్జీలు ఉంటాయనీ, అలాగే ఇతర ఛార్జీలు కూడా అదనంగా వసూలు చేయబడ్తాయని కార్గో ఏజెంట్లు స్పష్టం చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు స్థానికంగా ఛార్జీలు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఏజెంట్లు సమావేశం తర్వాత వివరించారు. ప్రమాదకర గూడ్స్ డోర్ టు డోర్ కార్గో గిఫ్ట్ పార్సెల్స్ ద్వారా అనుమతించరు. వినియోగదారులు అలాంటి వస్తువులేమీ తమ పార్సెల్స్‌లో ఉంచరాదు. మస్కట్ నుంచి బుక్ చేసుకున్న కార్గో 15 నుంచి 25 రోజుల వ్యవధిలో డెలివరీ అవుతుంది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







