హైదరాబాద్ లో అమజాన్ కార్యాలయానికి శంకుస్థాపన
- March 30, 2016
నగరంలో అమెజాన్ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్‌ను నెలకొల్పడం సంతోషకరంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు పేర్కొన్నారు. నగరంలోని వేవ్‌రాక్‌లో దేశంలోనే అతిపెద్దది, ప్రపంచంలో రెండో పెద్దదైన అమెజాన్ ఇండియా క్యాంపస్‌కు మంత్రి కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే అమెజాన్ పెద్ద క్యాంపస్ నిర్మిస్తోందని తెలిపారు. అమెజాన్ క్యాంపస్ 2019 వరకు పూర్తవుతుందని తెలిపారు. స్థానిక ఉత్పత్తులను అమెజాన్ విక్రయిస్తుందన్నారు. పెట్టుబడులకు అనుకూలంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్‌ను నెలకొల్పామని గుర్తు చేశారు. ఏప్రిల్ 4న సీఎం కేసీఆర్ ఐటీ పాలసీని ప్రకటిస్తారని చెప్పారు. నాలుగు సపరేట్ పాలసీలతో పాటు ఐటీ పాలసీని ఆవిష్కరిస్తామన్నారు. పలు పరిశ్రమల దిగ్గజాల సమక్షంలో ఐటీ పాలసీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ఇన్ఫోసిస్ వ్యవస్థాపక సభ్యుడైన నారాయణ మూర్తి కూడా హాజరవుతారని చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







