అల్ హోస్న్ గ్రీన్ పాస్ లేకుండానే అబుదాబిలోకి ఎంట్రీ
- February 26, 2022
యూఏఈ: అల్ హోస్న్ గ్రీన్ పాస్ లేకుండానే అబుదాబిలోకి ప్రవేశించవచ్చు. అబుదాబి ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ కమిటీ EDE స్కానర్ల తొలగింపును ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. యూఏఈ దేశాల నుండి ఎమిరేట్లోకి గ్రీన్ పాస్ కోసం లేకుండానే ప్రవేశించవచ్చు. ఫిబ్రవరి 28 (సోమవారం) నుండి ఈ నిబంధన అమల్లోకి రానున్నాయి. కాగా ఎమిరేట్‌లోని బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి మాత్రం గ్రీన్ పాస్ అవసరం అని అబుదాబి మీడియా కార్యాలయం ఒక ట్వీట్లో తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి తర్వాత ఫిబ్రవరి 15న విధించిన సామర్థ్యం, సామాజిక దూర పరిమితులను తాజాగా యూఏఈ సడలించింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య తగ్గడంతో ప్రస్తుతం సినిమా హాళ్లు, క్రీడా వేదికలు, పూజా స్థలాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







