పవిత్ర మసీదుల్లోకి 7 ఏళ్లు పైబడినవారికి అనుమతి

- February 26, 2022 , by Maagulf
పవిత్ర మసీదుల్లోకి 7 ఏళ్లు పైబడినవారికి అనుమతి

సౌదీ: 7 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇప్పుడు రెండు పవిత్ర మసీదుల్లోకి ప్రవేశించడానికి అనుమతిని పొందవచ్చని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది.  ఈ మేరకు తవక్కల్నా అప్లికేషన్ లో వారి ఆరోగ్య స్థితిని "ఇమ్యూన్"గా అప్డేట్ చేశారు. సౌదీ అరేబియాలో ఎవరైనా ఉమ్రా చేయాలనుకునే వారు యాప్‌లోని వారి ఆరోగ్య స్థితి “ఇమ్యూన్” అనే షరతుపై “ఈట్‌మార్నా” లేదా “తవక్కల్నా” అప్లికేషన్‌ల నుండి అనుమతి పొందవలసి ఉంటుందన్నారు. లబ్ధిదారుల డేటా తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉమ్రాకు ప్రతి 10 రోజులకు ఒకసారి అనుమతులు జారీ చేయబడతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో ఈ ఏర్పాటు కొనసాగుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని, ఏవైనా అప్డేడ్ ఉంటే తగిన సమయంలో ప్రకటిస్తామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com