మార్చి 1 నుంచి సాధారణ సేవల్ని పునరుద్ధరించనున్న పిహెచ్‌సిసి

- March 02, 2022 , by Maagulf
మార్చి 1 నుంచి సాధారణ సేవల్ని పునరుద్ధరించనున్న పిహెచ్‌సిసి


ఖతార్: ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (పిహెచ్‌సిసి), మార్చి 1 నుంచి సాధారణ రోజువారీ సేవల్ని పునరుద్ధరించనున్నారు. తిరిగి వైద్య సేవల్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వీలుగా ఫేజ్ 2ని అమలు చేయనున్నారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు మూడు దశలుగా ఈ సేవల్ని ఒక్కొక్కటిగా తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అన్ని సేవల్లోనూ 75 శాతం మేర అనుమతిస్తూ ఈ రెండో ఫేజ్ అమల్లోకి తెస్తారు. మూడో ఫేజ్‌లో పూర్తిస్థాయిలో సేవల్ని సాధారణ స్థికి తీసుకొస్తారు. దేశంలో 89 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో వైద్య సేవల విషయమై ప్రత్యేకమైన ప్లాన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com