తెలంగాణ: వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం
- March 02, 2022
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి రానుంది.ఈ మేరకు వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది.తెలంగాణలో ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్‌కు సంబంధించి అధ్యయనం చేయాలంటూ ఇటీవల సీఎం కేసీఆర్ మంత్రి సబిత ఇంద్రారెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. దీంతో ఈ కమిటీ బుధవారం ప్రత్యేకంగా సమావేశమైంది.
ఈ నేపథ్యంలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు తొలుత ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ ఖరారు చేసింది. తొలుత తెలుగు మీడియం చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ప్రతి పుస్తకంలో ఆంగ్లంలోని పాఠంతో పాటు సమాంతరంగా తెలుగులోనూ పాఠాన్ని అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతనలో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సభ్యులుగా ఉన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







