రష్యాకు బిగ్ షాక్..
- March 03, 2022
యుక్రెయిన్: యుక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా… ఓవైపు చర్చలు అంటూనే.. మరోవైపు భీకర దాడులకు పాల్పడుతోంది.ఇక, అదే స్థాయిలో యుక్రెయిన్ నుంచి కూడా ప్రతిఘటన ఎదురవుతోంది రష్యా బలగాలకు.. ఇరు దేశాలకు చెందిన సైనికులతో పాటు.. ప్రజలు కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నారు.. కేవలం సైనికులే కాదు.కీలక అధికారులు కూడా ప్రాణాలు కోల్పోవడం రష్యాకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.యుద్ధం మొదలై ఎనిమిది రోజులైనప్పటికీ యుక్రెయిన్ లో విధ్వంసం మాత్రం కొనసాగుతూనే ఉంది.. యుద్ధం మొదట్లో రష్యా ఆధిపత్యం చెలాయించినట్లు కనిపించినా ఆ తర్వాత యుక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు.దీంతో..యుక్రెయిన్ తో పాటు రష్యా కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.తాజాగా, ఈ యుద్ధంలో రష్యన్ మేజర్ జనరల్ హతమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది.ఎనిమిదో రోజు యుద్ధంలో రష్యన్ మేజర్ జనరల్ అండ్రీ సుఖోవిట్‌స్కీ ప్రాణాలు విడిచినట్టు బెలారస్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.అయితే, దీనిపై రష్యన్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







