చేపలు మామిడికాయ కూర
- March 31, 2016
కావలసిన పదార్థాలు: సొరచేప (చర్మంతో) - అరకేజి, పచ్చిమామిడి ముక్కలు (తొక్కతో పాటు) - ముప్పావు కప్పు, ఎండుకొబ్బరి తురుము - 1 కప్పు, ఉల్లిపాయ తరుగు - పావు కప్పు, కరివేపాకు - 8 రెబ్బలు, దనియాలపొడి - అర టీ స్పూను, మిరియాలపొడి - పావు టీ స్పూను, పసుపు - చిటికెడు, నీరు - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం : చేపని అంగుళం ‘క్యూబ్’లుగా కోసి పెట్టుకోవాలి. కొబ్బరి తురుము, ఉల్లితరుగు, 4 రెబ్బల కరివేపాకు, ధనియాలపొడి, మిరియాలపొడి, పసుపును అరకప్పు నీటితో పేస్టులా గ్రైండు చేసుకోవాలి. కడాయిలో పేస్టుని వేసి మిగిలిన అరకప్పు నీరు, చేపముక్కలు వేసి ఉడికించాలి. చేప సగం ఉడికిన తర్వాత మామిడి ముక్కలు, చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి సన్నని మంటమీద ఉడికించి దించేయాలి. నూనెలేకుండా చేసుకునే ఈ చేపలకూర వేడి వేడి అన్నంతో ఎంతో రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









