ఐపీఎల్- 2022 పూర్తి షెడ్యూల్ విడుదల
- March 06, 2022
ఐపీఎల్- 2022 సీజన్ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది మార్చి 26 న మొదటి మ్యాచ్ జరగనుండగా, మే 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే మైదానంలో జరగనుంది. కాగా ఐపీఎల్-15 సీజన్ మొత్తం 65 రోజుల పాటు జరగనుంది. మొత్తం 70 లీగ్ మ్యాచ్ లు జరుగనున్నాయి.మరో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. మే22న చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది.
ముంబయిలోని వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాల్లో 20 మ్యాచ్ లు చొప్పున జరగనుండగా… పుణేలోని ఎంసీఏ స్డేడియంలో, ముంబైలోని బ్రబోర్న్ స్టేడియాల్లో 15 మ్యాచ్ ల చొప్పున జరుగుతాయి. ఈసారి మొత్తం 12 డబుల్ హెడర్స్ జరగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్ 3.30లకు ప్రారంభంకానుండగా .. రాత్రి మ్యాచ్ గం. 7.30లకు స్టార్ట్ కానుంది. మే 22న హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే పోరుతో లీగ్ పోరు ముగుస్తుంది. ఫైనల్ వేదికను వెల్లడిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు.
పూర్తి మ్యాచ్ ల వివరాలు...


తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







