భారత్ కరోనా అప్డేట్
- March 07, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కంట్రోల్ లోకి వచ్చినట్లేనని భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. దాదాపు ఐదు వేల లోపు కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఊపిరిపీలుస్తున్నారు. మరణాల సంఖ్య దాదాపు తగ్గుతోంది. తాజాగా..4 వేల 362 కేసులు నమోదు కాగా.. 66 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 54,118 యాక్టీవ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. 416 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 178.90 కోట్ల డోసుల టీకాలు అందచేశారు. ఆదివారం 4,80,144 డోసుల టీకాలు అందచేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 178,90,61,887 డోసుల టీకాలు అందచేయడం జరిగిందని వెల్లడించింది.
ఇంకోవైపు..కరోనా నిర్ధారించేందుకు జరుగుతున్న టెస్టులు కొనసాగుతున్నాయి. కరోన నిర్ధారణ పరీక్షలు 77.34 కోట్లకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,12,926 టెస్టులు నిర్వహించినట్లు, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 77,34,37,172 టెస్టులు జరిగాయని ICMR తెలిపింది. దేశవ్యాప్తంగా 3309 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా ప్రజలకు 1426 ప్రభుత్వ లాబ్స్,1883 ప్రైవేట్ లాబ్స్ అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్‌షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!







