సన్‌రైజర్స్ పూర్తి షెడ్యూల్

- March 07, 2022 , by Maagulf
సన్‌రైజర్స్ పూర్తి షెడ్యూల్

ఐపీఎల్ 2022 మెగా సమరానికి సైరన్ మోగింది. మార్చి 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభమవుతుంది.అనంతరం మే 29న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది. ఇక ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఆడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. కేన్‌ విలియమ్సన్‌ సారధ్యంలోని ఆరెంజ్‌ ఆర్మీ ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడనుంది.

మార్చి 29 (మంగళవారం)న విలియమ్సన్‌ సేన తమ తొలి లీగ్‌ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలబడనుంది. ఈ మ్యాచ్‌కు పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదిక కానుంది. రాత్రి 7:30 మ్యాచ్‌ ప్రారంభంకానుంది. అనంతరం ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. గతేడాది మూడే మూడు విజయాలతో ఆఖరి స్థానంలో నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌..

తేదీ: ఏప్రిల్ 4 (సోమవారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: లక్నో సూపర్ జెయింట్స్‌, వేదిక: డివై పాటిల్ స్టేడియం, ముంబై

తేదీ: ఏప్రిల్ 9 (శనివారం), సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు, ప్రత్యర్ధి: చెన్నై సూపర్ కింగ్స్‌, వేదిక: డివై పాటిల్ స్టేడియం, ముంబై

తేదీ: ఏప్రిల్ 11 (సోమవారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: గుజరాత్ టైటాన్స్‌, వేదిక: డివై పాటిల్ స్టేడియం, ముంబై

తేదీ: ఏప్రిల్ 15 (శుక్రవారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌, వేదిక: బ్రబోర్న్‌ స్టేడియం, ముంబై

తేదీ: ఏప్రిల్ 17 (ఆదివారం), సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు, ప్రత్యర్ధి: పంజాబ్‌ కింగ్స్‌, వేదిక: డివై పాటిల్ స్టేడియం, ముంబై

తేదీ: ఏప్రిల్ 23 (శనివారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, వేదిక: బ్రబోర్న్‌ స్టేడియం, ముంబై

తేదీ: ఏప్రిల్ 27 (బుధవారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: గుజరాత్‌ టైటాన్స్‌, వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై

తేదీ: మే 1 (ఆదివారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: చెన్నై సూపర్ కింగ్స్‌, వేదిక: ఎంసీఏ స్టేడియం, పూణే

తేదీ: మే 5 (గురువారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: ఢిల్లీ క్యాపిటల్స్‌, వేదిక: బ్రబోర్న్‌ స్టేడియం, ముంబై

తేదీ: మే 8 (ఆదివారం), సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు, ప్రత్యర్ధి: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై

తేదీ: మే 14 (శనివారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌, వేదిక: ఎంసీఏ స్టేడియం, పూణే

తేదీ: మే 17 (మంగళవారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: ముంబై ఇండియన్స్‌, వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై

తేదీ: మే 22 (ఆదివారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: పంజాబ్‌ కింగ్స్‌, వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com