పనిమనిషిని వేధించిన యజమానికి 15 ఏళ్ల జైలు
- March 12, 2022
దుబాయ్: విదేశీ పౌరసత్వం ఉన్న అరబ్ మేనేజర్‌పై కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ జారీ చేసిన జీవిత ఖైదును 15 సంవత్సరాల జైలుశిక్షగా దుబాయ్ అప్పీలేట్ కోర్ట్ మార్చింది. జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతనిని దేశం నుంచి బహిష్కరించాలన్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. నిందితుడు తన వద్ద పనిచేసిన ఒక ఆసియా పనిమనిషిని నిర్బంధించి, చనిపోయే వరకు ఆమెపై దాడి చేసినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసు సెప్టెంబర్ 2020 లో జరిగింది. తీవ్ర గాయాలతో ఉన్న ఆసియా మహిళను దుబాయ్‌లోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుదూ సదరు మహిళ మరణించింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. తీవ్ర గాయాలతోనే సదరు మహిళ మరణించిందని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. పోలీసుల విచారణలో నిందితుడి తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతనికి 15 సంవత్సరాల జైలు శిక్షను దుబాయ్ కోర్టు విధించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







