పరుచూరి స్టార్ రైటర్ ఫోటో చూసి షాకైన అభిమానులు!

- March 12, 2022 , by Maagulf
పరుచూరి స్టార్ రైటర్ ఫోటో చూసి షాకైన అభిమానులు!

హైదరాబాద్: పరుచూరి వెంకటేశ్వర రావు ఎన్నో సినిమాలకి కథ, కథనం మాటలు అందించి చాలా మంది హీరోలను స్టార్ లని చేసిన రైటర్స్ పరుచూరి బ్రదర్స్.. ఇందులో పెద్దవారైన పరుచూరి వెంకటేశ్వరరావు (80) ప్రస్తుతం వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. కనీసం బయటకు కూడా రావడం లేదు.

అయితే ఇటీవలే ఆయనని కలిసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ పరుచూరి వెంకటేశ్వరరావుతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ పిక్ చూసి అందరు షాక్ అవుతున్నారు.. వెంకటేశ్వరరావు గారు ఇలా అయ్యరెంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దివంగత నటుడు నందమూరి తారక రామారావు 1981లో పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ లకు 'పరుచూరి బ్రదర్స్' అని నామకరణం చేసి, తన సొంత చిత్రం 'అనురాగదేవత' ద్వారా రచయితులగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

తన తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణతో కలిసి 333కు పైగా సినిమాలకు రచయితగా పనిచేశాడు వెంకటేశ్వరరావు. కేవలం రచయితగానే కాకుండా నటుడుగా తనదైన ముద్రవేశారు వెంకటేశ్వరరావు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com