తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు… పోటీపడే అభ్యర్ధులకు శుభవార్త
- March 13, 2022
హైదరాబాద్: తెలంగాణలో పోలీసు శాఖలో ఖాళీల భర్తీ చేయనున్న నేపధ్యంలో పోటీకి సిద్ధమౌతున్న అభ్యర్ధులకు సైబరాబాద్ పోలీసులు మంచి శుభవార్త అందించారు.శంషాబాద్ జోన్ కు స్ధానికతకు చెందిన అర్హులైన నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలకు అవసరమైన శిక్షణను ఉచితంగా అందజేయనున్నట్లు ప్రకటించారు.శంషాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి అధ్వర్యంలో ఈ శిక్షణ అందించనున్నారు.
పోలీస్ శాఖలో 18, 334 ఖాళీలు భర్తీ చేయనున్న నేపధ్యంలో అనేక మంది నిరుపేద వర్గాలకు చెందిన నిరుద్యోగులు శిక్షణ తీసుకునేందుకు సరైన స్ధోమత లేక ఇబ్బందులపడతారన్న ఉద్దేశంతో వారి కోసం ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులు ప్లాన్ చేశారు. ఈ సారి ఈ ఉద్యోగాలకు అత్యధికమంది పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.
ఈనేపధ్యంలో శంషాబాద్ డిప్యూటీ కమినర్ ఆఫ్ పోలీసు అధ్యర్యంలో జరుగుతున్న ఈ శిక్షణకు మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అనుభవం కలిగిన నిపుణులతో అవుట్ డోర్, ఇండోర్ ఫ్యాకల్టీతో అన్ని అంశాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. శంషాబాద్ జోన్ ప్రాంతానికి చెందిన అర్హత కలిగిన యువతి యువకులు ఈ విలువైన అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇంటర్ పాసై , 18 ఏళ్లకు పైగా వయస్సు కలిగిన అభ్యర్ధులు మాత్రమే ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు శంషాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఈ నెల 14వ తేదీ నుండి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం







