కారు షేడ్స్ కోసం కొత్త రూల్స్
- March 16, 2022
కువైట్: కార్ షేడ్స్ ఏర్పాటుపై కొత్త నిబంధనల ముసాయిదా సవరణలకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అనేక నిబంధనలను కువైట్ మునిసిపాలిటీ సవరించింది. ముఖ్యంగా పబ్లిక్ స్క్వేర్ల ఎదురుగా కారు షేడ్స్ ను ఏర్పాటు చేయడాన్ని నిషేధించారు. ప్రైవేట్ ఇళ్ల ప్రాంగణంలో కారు షేడ్స్ కోసం లైసెన్స్ పొందాలనే నిబంధనను రద్దు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం.. కారు షేడ్ల ఎత్తు నాలుగు మీటర్లకు మించకూడదు. ప్రైవేట్ ఇళ్ళ దగ్గర ఏర్పాటు చేసుకునే షేడ్స్ కు లైసెన్స్ ఫీ మినహాయించారు. ప్రభుత్వ ఏజెన్సీలకు సంవత్సరానికి ఒక చదరపు మీటరుకు KD1 (సింగిల్ టైమ్ ఫీ), కమర్షియల్ KD5 గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్‌లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్‌లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక







