"మొలకల చాట్"

- April 01, 2016 , by Maagulf

పిల్లలకి కాస్త రుచిగా మరియు పౌష్టిక విలువలు అందించే "మొలకల చాట్" తయారీ చూద్దాం..

 

కాలవసిన పదార్ధాలు:

పెసర మొలకలు   - 1 కప్పు

నూనె                  - 1 టీ స్పూను

ఆవాలు                 - 1/4 టీ స్పూను

జీలకర్ర                  - 1/4 టీ స్పూను

కరివేపాకు                           - కొన్ని రెమ్మలు

ఉల్లి ముక్కలు                     - 1/4 కప్పు

అల్లం వెల్లుల్లి పేస్ట్  - 1 టీ స్పూను

కారం                                   - 1/2 టీ స్పూను

పసుపు                               - చిటికెడు

ధనియాలు, జీలకర్ర పొడి - 1/2 టీ స్పూను

ఉప్పు                                  - తగినంత

సర్వింగ్ కోసం:

చిలికిన తాజా పెరుగు          - 4 టేబుల్ స్పూన్లు

ఉప్పు                                  - తగినంత

ఉల్లి ముక్కలు                     - 2 టేబుల్ స్పూన్లు

టమాటా ముక్కలు              - 2 టేబుల్ స్పూన్లు

కొత్తిమీర                              - 2 టేబుల్ స్పూన్లు

కారం                                   - 1/2 టీ స్పూను

 

తయారు చేయు విధానం:

  1. బాండీలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
  2. ఇవి చిటపటమన్న తరువాత కరివేపాకు, ఉల్లి ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
  3. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాలు జీలకర్ర పొడి, టమాటా, మొలకలు,పావు కప్పు నీళ్ళు, ఉప్పు వేసి మీడియం మంట మీద మొలకలు మధ్యస్తంగా ఉడికేవరకు 5 నిమిషాలు కలుపుతూ వేయించాలి.
  4. తర్వాత పొయ్యి మీద నుంచి దింపి చల్లారనివ్వాలి. ఈ మిక్చర్ ని రెండు సమ భాగాలు చేయాలి.
  5. ఒక భాగాన్ని గిన్నెలో వేసి 2 టేబుల్ స్పూన్ల తాజా పెరుగు వేసి కొద్దిగా ఉప్పు చల్లి 1 టేబుల్ స్పూను ఉల్లి ముక్కలు, 1 టేబుల్ స్పూను టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూను కొత్తిమీర తరుగు, చిటికెడు కారం వేసి కలిపి సర్వ్ చేయాలి.
  6. రెండో సగ భాగం కూడా పైవిధంగానే చేసి సర్వ్ చేయాలి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com