"మొలకల చాట్"
- April 01, 2016
పిల్లలకి కాస్త రుచిగా మరియు పౌష్టిక విలువలు అందించే "మొలకల చాట్" తయారీ చూద్దాం..
కాలవసిన పదార్ధాలు:
పెసర మొలకలు - 1 కప్పు
నూనె - 1 టీ స్పూను
ఆవాలు - 1/4 టీ స్పూను
జీలకర్ర - 1/4 టీ స్పూను
కరివేపాకు - కొన్ని రెమ్మలు
ఉల్లి ముక్కలు - 1/4 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూను
కారం - 1/2 టీ స్పూను
పసుపు - చిటికెడు
ధనియాలు, జీలకర్ర పొడి - 1/2 టీ స్పూను
ఉప్పు - తగినంత
సర్వింగ్ కోసం:
చిలికిన తాజా పెరుగు - 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
ఉల్లి ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
టమాటా ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
కారం - 1/2 టీ స్పూను
తయారు చేయు విధానం:
- బాండీలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
- ఇవి చిటపటమన్న తరువాత కరివేపాకు, ఉల్లి ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
- తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాలు జీలకర్ర పొడి, టమాటా, మొలకలు,పావు కప్పు నీళ్ళు, ఉప్పు వేసి మీడియం మంట మీద మొలకలు మధ్యస్తంగా ఉడికేవరకు 5 నిమిషాలు కలుపుతూ వేయించాలి.
- తర్వాత పొయ్యి మీద నుంచి దింపి చల్లారనివ్వాలి. ఈ మిక్చర్ ని రెండు సమ భాగాలు చేయాలి.
- ఒక భాగాన్ని గిన్నెలో వేసి 2 టేబుల్ స్పూన్ల తాజా పెరుగు వేసి కొద్దిగా ఉప్పు చల్లి 1 టేబుల్ స్పూను ఉల్లి ముక్కలు, 1 టేబుల్ స్పూను టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూను కొత్తిమీర తరుగు, చిటికెడు కారం వేసి కలిపి సర్వ్ చేయాలి.
- రెండో సగ భాగం కూడా పైవిధంగానే చేసి సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







