ప్రపంచంలోని మూడు ఫార్మా దిగ్గజ కంపెనీలతో మంత్రి కేటీఆర్ సమావేశం
- March 26, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు చొరవతో ఫార్మా దిగ్గజ కంపెనీలు తమ పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్ కే ప్రాధాన్యత ఇస్తున్నాయి. మంత్రి కె. తారకరామారావుతో సమావేశం తరువాత పలు కంపెనీలు హైదరాబాద్ లో కొత్తగా పెట్టుబుడుల పెడతామని ప్రకటించడంతో పాటు మరికొన్ని కంపెనీలు భారీగా విస్తరణ ప్రణాళికలు ప్రకటించాయి. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంతగా లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఫార్మా కంపెనీలు గుర్తిస్తున్నాయి. తెలంగాణలోని పారిశ్రామిక అనుకూలతలు, పారదర్శకత పాలనతో ఫార్చ్యూన్ కంపెనీలు అమెరికా ఆవల తమ కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్ నే ఎంపిక చేసుకుంటున్నాయి. హైదరాబాద్ లోని లైఫ్ సైన్సెస్ రంగానికి మరింత బూస్ట్ ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా మూడు ఫార్మా దిగ్గజ కంపెనీలతో న్యూయార్క్ లో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రఖ్యాత కంపెనీలైన ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్జ జి.ఎస్.కే సీనియర్ ప్రతినిధులను కేటీఆర్ కలుసుకున్నారు. ప్రపంచంలోనే టాప్ ఫార్మాసూటికల్ కార్పోరేషన్ కంపెనీ లైన ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ (జీ.ఎస్.కే )లాంటి ఫార్చూన్ 500 కంపెనీలతో సమావేశం అయ్యారు.
ముందుగా ఫైజర్ సీఈఓ, ఛైర్మెన్ డాక్టర్ ఆల్బర్ట్ బౌర్లా , ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ గ్లోబల్ సప్లై ఆఫీసర్ మైక్ మెక్‌డెర్మాట్ , సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ ఉవే స్కోన్బెక్ తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణలో ఉన్న అపార అవకాశాలు, మానవ వనరుల గురించి వారికి వివరించారు. తమ ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, ఇస్తున్న ప్రాధాన్యతను తెలిపారు.
ఆ తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో ఒకటైన జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఆర్ అండ్ డీ ఫార్మాసూటికల్స్, డాక్టర్ మథాయ్ మమ్మన్ ను మంత్రి కేటీఆర్ కలిశారు. ఫార్మా పరిశోధనలకు హైదరాబాద్ లో ఉన్న అనుకూలతలను వారికి కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ కు మాత్రమే సొంతమైన టెక్నాలజీ, డిజిటల్ ఆవిష్కరణ కేంద్రమైన మరో ఫార్మా కంపెనీ గ్లాక్సో స్మిత్‌క్లైన్ (GSK) సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అయిన ఆగమ్ ఉపాధ్యాయకు మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంపై మూడు దిగ్గజ కంపెనీల సీనియర్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం కలిగిందన్నారు. కేటీఆర్ లాంటి విజనరీ మంత్రి గా ఉండడం భారత పారిశ్రామిక రంగానికి ఎంతో ప్రయోజనం అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ ను టాప్ గా నిలిపేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించారు. తమ ప్రయత్నాలకు చేయూత ఇవ్వాలని కోరిన కేటీఆర్, సలహాలు సూచనలు అడిగారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లో హైదరాబాద్ లో జరగబోయే 20వ బయో ఏషియా కన్వెన్షన్ కు రావాలని మూడు దిగ్గజ కంపెనీల ప్రతినిధులను కేటీఆర్ ఆహ్వానించారు.
ఈ సమావేశాలలో మంత్రి కేటీఆర్ తో పాటు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







