పాండిచ్చేరి-హైదరాబాద్ ఫస్ట్ డైరెక్ట్ ఫ్లైట్ లో ప్రయాణించిన టి.గవర్నర్
- March 27, 2022
హైదరాబాద్: పాండిచ్చేరి-హైదరాబాద్ మధ్య ప్రవేశపెట్టిన మొదటి డైరెక్ట్ విమానంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై ప్రయాణించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో గవర్నర్ తీసుకున్న చొరవతో పాండిచ్చేరి-హైదరాబాద్ మధ్య డైరెక్ట్ ఫ్లైట్ ప్రవేశపెట్టారు. గవర్నర్ తమిళి సై శంషాబాద్ విమానాశ్రయంలోని జనరల్ అరైవల్ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పుదుచ్చేరిలోని అందమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడతారని అన్నారు.
పుదుచ్చేరి ప్రజలు హైదరాబాద్ బిర్యానీని రుచి చూడటానికి ఇష్టపడతారని తెలిపారు. రోజువారీ విమాన ప్రయాణం ఈ రెండు ప్రాంతాల ప్రజల బంధాన్ని మెరుగుపరుస్తుందని గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి విమాన సర్వీసులను పునరుద్ధరించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.
పుదుచ్చేరికి విమాన కనెక్టివిటీని పెంచేందుకు హామీ ఇచ్చినందుకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. పుదుచ్చేరి విమానాశ్రయంలో రన్‌వే విస్తరణ కోసం తమిళనాడు నుంచి భూమిని సేకరించేందుకు చర్యలు తీసుకుంటామని గవర్నర్ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







