అతిత్వరలో ఏపీలో ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకం!
- March 29, 2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆన్లైన్ టికెట్ల విధానంపై జగన్ మోహన్ రెడ్డి సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఏపీలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పూర్తిగా ఆన్లైన్ లో సినిమా టికెట్లను పొందేలా వెసులు బాటును ప్రేక్షకుల కోసం తీసుకు వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ సన్నద్ధమవుతోంది.
ఇప్పటికే టిక్కెట్ల అమ్మకాల కోసం టెండర్లు పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం… ప్రైవేటు సంస్థల కంటే తక్కువ ధరకు ప్రభుత్వమే నిర్వహించేలా పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే టెండర్లలో జస్ట్ టికెట్స్ L 1 సంస్థ గా నిలిచినట్లు సమాచారం అందుతోంది.
అదే సమయంలో అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టికెట్ల అమ్మకాలు చేసేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అంతేకాదు ప్రేక్షకుల పై ఆన్లైన్ ఛార్జీల భారం కూడా పడకుండా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా టికెట్ల రేట్ల నియంత్రనతో పాటు… క్యూలలో ప్రేక్షకులు గంటలు గంటలు నిలబడాల్సిన పరిస్థితికి ముగింపు పడడంతో పాటు, బ్లాక్ టిక్కెట్ల విక్రయానికి బ్రేక్ పడనుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







