సైనా నెహ్వాల్ పరాజయo..
- April 03, 2016
సిరి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించింది. సెమీ ఫైనల్‌లో మూడో సీడ్ లీ జురుయ్‌తో తలపడిన రెండో ర్యాంక్ క్రీడాకారిణి సైనా 20-22, 21-17, 19-21 తేడాతో ఓటమిపాలైంది. ఇటీవల కొంతకాలంగా కాలి మడమ గాయంతో బాధపడుతున్న సైనా ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఆమె ఆట స్పష్టం చేస్తున్నది. అయితే, ఆమె చివరి వరకూ పోరాటం సాగించి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. కాగా, టైటిల్ కోసం రచానొక్ ఇంతానన్‌తో జురుయ్ తలపడుతుంది. మరో సెమీ ఫైనల్‌లో ఇంతానన్ 21-8, 21-11 ఆధిక్యంతో బయే ఇయాంగ్ జూపై గెలిచింది.పురుషుల సింగిల్స్‌లో విక్టర్ అక్సెల్సెన్, కెంటో మొమొతా ఫైనల్ చేరారు. అక్సెల్సెన్ 21-11, 21-11 స్కోరుతో సన్ వాన్ హూను ఓడించాడు. మరో సెమీ ఫైనల్‌లో మొమొతా మొదటి సెట్‌ను 17-21 తేడాతో చేజార్చుకున్నాడు. రెండో సెట్‌లో 3-6 తేడాతో వెనుకబడ్డాడు. అయితే, అ దేశలోనే ఫిట్నెస్ సమస్యతో పోటీ నుంచి వైదొలగడంతో మొమొతాకు ఫైనల్‌లో స్థానం దక్కింది. బాగానే ఆడాను! తాను బాగానే ఆడానని, అయతే, అంతకంటే మెరుగ్గా ఆడే అవకాశం తనకు ఉండిందని సైనా చెప్పింది. సెమీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె విలేఖరులతో మాట్లాడుతూ జురుయ్‌పై తీవ్రంగానే పోరాడినట్టు చెప్పింది. అయతే, ఒకటిరెండు చిన్నపొరపాట్ల కారణంగా ఓటమి తప్పలేదని వాపోయంది. ఇంతకంటే మెరుగ్గా ఆడే సత్తా తనకు ఉందని చెప్పింది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







