టీసీఎస్ ఉద్యోగులు మోదీతో సెల్ఫీ..
- April 03, 2016
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సౌదీ అరేబియాలోని రియాద్ లో టాటా కన్సల్టెన్సీ కార్యాలయాన్ని (టీసీఎస్) సందర్శించారు. మోదీకి టీసీఎస్ ప్రతినిధులు, మహిళా ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. మహిళలతో నడిచే టీసీఎస్ ఐటీ సెంటర్ ను సందర్శించిన మోదీ ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులతో ముచ్చటించారు. ఉద్యోగినులు మోదీతో కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.మోదీ మాట్లాడుతూ.. మహిళా సాధికారితకు ఐటీ నిపుణులు సలహాలు ఇవ్వాలని సూచించారు. అభివృద్ధిలో మహిళా శక్తి పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. 'మీరందరూ తప్పకుండా భారత్ కు రావాలి. మీరు అద్భుతమైన ఆతిథ్యం స్వీకరిస్తారు' అని ఉద్యోగులను ఉద్దేశించి మోదీ అన్నారు.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







