25 కోట్లకు అమ్ముడైన వరుణ్ తేజ్ 'గని' సినిమా అన్ని భాషల ఓటిటి, శాటిలైట్ రైట్స్..
- March 31, 2022హైదరాబాద్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. సిద్దు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాకు నిర్మాతలు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ పై మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. తాజాగా ఈ సినిమా అన్ని భాషల ఓటిటి, శాటిలైట్ రైట్స్ 25 కోట్లకు అమ్ముడయ్యాయి. కేవలం ట్రైలర్ మాత్రమే చూసి ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. సినిమాను అద్భుతంగా ఉంటుందని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
నటీనటులు:
వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు
టెక్నికల్ టీమ్:
దర్శకుడు: కిరణ్ కొర్రపాటి
నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద
సమర్పకుడు: అల్లు అరవింద్
సినిమాటోగ్రపీ: జార్జ్ సి విలియమ్స్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
సంగీతం: థమన్
పిఆర్ఓ: వంశీ కాక, ఏలూరు శ్రీను
తాజా వార్తలు
- ఈ నెల జూన్ 24, 25 తేదీల్లో 11వ ఇంటర్నేషనల్ పోలీస్ ఎక్స్పో
- రామోజీ ఫిల్మ్‌సిటీలో టీజీ20 లీగ్ వేలం షురూ
- వనపర్తిలో అంబులెన్స్ ప్రారంభం..నిరుపేదలకు ఉచిత ఆటోలు పంపిణీ చేసిన సోనుసూద్
- 100 రోజులు.. స్థిరత్వాన్ని కాపాడుకున్న గల్ఫ్ దేశాలు..!!
- ప్రపంచవ్యాప్తంగా హ్యుమటేరియన్ సేవల్లో కువైట్ ఛారిటీస్..!!
- యూఏఈ లాటరీ డ్రా..ఒక్కొక్కరు Dh50,000 గెలుచుకున్నముగ్గురు విజేతలు..!!
- ఆన్లైన్ పర్యాటక మోసాలపై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- మహిళను సురక్షితంగా తరలించిన ఆర్ఓపి ఏవియేషన్..!!
- భారతీయ మహిళకు అండగా నిలిచిన ఇండియన్ ఎంబసీ..!!
- 'మీ సురక్ష–కలిసి ఉంటే కలదు సుఖం' కార్యక్రమం ఘనంగా నిర్వహణ









