'వర ఐపీఎస్' ఫస్ట్ లుక్ విడుదల..!!
- April 03, 2022
హైదరాబాద్: క్రాక్, నాంది వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. లేడీ ప్రధానమైన పాత్రలు ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'వర ఐపీఎస్'. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈ రోజు విడుదల చేసింది చిత్ర బృందం. తలైవసల్ విజయ్, రవి కాలే, సుమిత్ర, భరత్ రెడ్డి తదితరులు నటించారు. శ్రీ లలితాంబికా ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నఈ సినిమా తెలుగు హక్కులను శ్రీ లక్ష్మి జ్యోతి బ్యానర్ వారు దక్కించుకున్నారు.
శ్రీ లక్ష్మి జ్యోతి బ్యానర్ అధినేత ఏ ఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తుండగా ఈ రోజు విడుదలైన పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. సినిమాలో నటిస్తున్న ప్రధాన పాత్రలతో రూపొందించిన ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఒరేయ్ బామ్మర్ది వంటి విజయవంతమైన సినిమాలు విడుదల చేసిన ఈ సంస్థ నుంచి మరో ఆసక్తి పరిచే సినిమా రావడం విశేషం. వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ ఐపీఎస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కి జగదీష్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా కేజీఎఫ్ లాంటి భారీ సినిమాకి సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. మాథ్యూస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు
వరలక్ష్మి శరత్ కుమార్, తలైవసల్ విజయ్, రవి కాలే, సుమిత్ర, భరత్ రెడ్డి, బ్లాక్ పాండి, రాజేష్ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : శ్రీ లలితాంబికా ప్రొడక్షన్, శ్రీ లక్ష్మి జ్యోతి బ్యానర్ విడుదల : ఏ ఎన్ బాలాజీ
దర్శకుడు : జేకే
DOP: మాథ్యూస్
మ్యూజిక్: రవి బస్రూర్
ఎడిటర్: వెంకీ యూ.డీ.వీ
ఫైట్స్ : జాలీ బాస్టియన్, సిరుతై గణేష్
పీఆర్వో : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







