ఏప్రిల్ 6న నాని, `అంటే సుందరానికి` చిత్రం నుంచి మొదటి సింగిల్ పంచెకట్టు రిలీజ్
- April 04, 2022
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `అంటే సుందరానికి`. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చారు. ఈ సందర్భంగా మొదటి సింగిల్ పంచెకట్టును ఏప్రిల్ 6న సాయంత్రం 6:03 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సందర్భంగా విడుదలచేసిన పోస్టర్‌లో నాని, తన విదేశీ పర్యటన USAలోని సుందరమైన లొకేషన్‌లను ఆస్వాదిస్తూ, కారుడోర్‌లోంచి తల బయట పెట్టుకుని ఆశ్చర్యంగా పైకి చూస్తూ నవ్వుతూ కనిపించాడు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కు ట్రెమండస్ రెస్సాన్స్ వచ్చింది.
నాని సరసన నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తోంది ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు లీలా థామస్.
ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహించారు. అంటే సుందరానికి జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: నాని, నజ్రియా ఫహద్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: నవీన్ యెర్నేని & రవిశంకర్ వై
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
CEO: చెర్రీ
మ్యూజిక్ కంపోజర్: వివేక్ సాగర్
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి
ఎడిటర్: రవితేజ గిరిజాల
ప్రొడక్షన్ డిజైన్: లతా నాయుడు
పబ్లిసిటీ డిజైన్: అనిల్ & భాను
PRO: వంశీ శేఖర్
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







