యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రాజమండ్రి రోజ్ మిల్క్
- April 04, 2022
హైదరాబాద్ : కొత్తదనంతో కూడిన చిత్రాలను ఆదరించడంలో మన ప్రేక్షకులు ముందు వరుసలో వుంటారు. రొటిన్ ఫార్ములాను బ్రేక్ చేస్తూ వచ్చే వైవిధ్యమైన చిత్రాలకు పెద్దపీట వేస్తారు. ఇప్పుడు అలాంటి కోవలోనే రాబోతున్న మరో చిత్రం రాజమండ్రి రోజ్ మిల్క్. ఉగాది సందర్భంగా ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. నాని బండ్రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, తో కలిసి ఇంట్రూప్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డి.సురేష్‌బాబు, PRADEEP ఉప్పలపాటి నిర్మాతలు. జై జాస్తి, అవంతిక ముఖ్యతారలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటులు వెన్నెల కిషోర్, ప్రవీణ్‌లు చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు ధరహాస్, వెంకట్‌గణేష్, హేమంత్ మధుమణి, ప్రీతినిగమ్‌లు ఇతర పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం విశేషాలను దర్శకుడు నాని బండ్రెడ్డి తెలియజేస్తూ ఇటీవల చిత్రీకరణ ప్రారంభించాం. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అందరికి కాలేజీ రోజులను గుర్తుచేస్తుంది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ చిత్రం జ్ఞప్తికి తెస్తుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ వర్గీస్, గోవింద్ వసంత్, అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్, డీఓపీ: ముఖేష్.జి, సాహిత్యం: చంద్రబోస్, అనంత్‌శ్రీరామ్, శ్రీమణి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







