నాగ శౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో SLV సినిమాస్ ప్రకటన
- April 04, 2022
హైదరాబాద్ : ప్రత్యేకమైన కథలను ఎంచుకుంటున్న యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నాగ శౌర్య మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై సంతకం చేశాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) పతాకంపై ప్రొడక్షన్ నెం 6గా సుధాకర్ చెరుకూరి నిర్మించబోయే కొత్త చిత్రాన్ని నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టితో చేయనున్నాడు.
SLV సినిమాస్ అందరినీ ఆకట్టుకునే విభిన్న జానర్ సినిమాలను రూపొందిస్తున్నందున, టాలీవుడ్‌లో మంచి సినిమాలు నిర్మిస్తున్న నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరుపొందింది. పవర్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన కథను నాగ శౌర్య కోసం దర్శకుడు సిద్ధం చేశారు. కమర్షియల్ సబ్జెక్ట్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో నావల్‌పాయింట్ నాగ శౌర్యను ఆకట్టుకుంది.
తెలుగు నూతన సంవత్సరం - ఉగాది సందర్భంగా శనివారంనాడు ప్రకటించబడిన ఈ చిత్రంలో నాగశౌర్య సరికొత్తగా కనిపించనున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా కోసం అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ పనిచేయనున్నారు.
ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారు.
తారాగణం: నాగ శౌర్య
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: పవన్ బాసంశెట్టి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







