BenefitPay తో చేతులు కలిపిన LuLu Exchange
- April 04, 2022
బహ్రెయిన్: దేశంలోని అతిపెద్ద క్రాస్-బోర్డర్ చెల్లింపుల కంపెనీలలో ఒకటైన LuLu Exchange, BenefitPay వినియోగదారులకు మరింత సులభంగా సర్వీసులు అందించేందుకు చేతులు కలిపింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న LuLu Exchange తన 16 శాఖలలో పేమెంట్స్, కరెన్సీ మార్పిడి లావాదేవీలను నిర్వహించడానికి అనుమతిస్తుంది. వినియోగదారులు LuLu ఎక్స్ఛేంజ్ బ్రాంచ్ కౌంటర్లలో QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వారి బెనిఫిట్‌పే ఖాతాలను ఉపయోగించి నగదు రహిత లావాదేవీలను జరుపవచ్చు. ఈ కరెన్సీ బదిలీ ఫిజికల్ టెల్లర్ సమక్షంలో జరుగుతుంది. ఈ సందర్భంగా లులు ఎక్స్ఛేంజ్ జనరల్ మేనేజర్ ఎడిసన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. బహ్రెయిన్ డిజిటలైజేషన్ ప్రయత్నాలకు ఈ ఒప్పందం అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుందన్నారు. బెనిఫిట్‌పేకు బహ్రెయిన్‌లో అర మిలియన్ మంది వినియోగదారులు ఉన్నారని, BenefitPayతో భాగస్వామ్యంతో నగదు రహిత నగదు బదిలీని ఇష్టపడే వేలాది మంది వినియోగదారులకు తమ బ్రాంచ్‌లలో లావాదేవీలు సమానంగా సౌకర్యవంతంగా అందుతాయన్నారు. బెనిఫిట్ పే డిప్యూటీ CE Yousif Al-Nefaiei మాట్లాడుతూ.. తమ భాగస్వామ్యం నగదు వినియోగాన్ని తగ్గించడంలో మరియు దేశాన్ని డిజిటల్ చెల్లింపుల వైపు మార్చడంలో.. నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో బహ్రెయిన్ స్థానాన్ని పెంచుతుందన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







