శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదలైన ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ ట్రైలర్
- April 04, 2022
హైదరాబాద్: సిరి మూవీస్ బ్యానర్‌పై రమణ్ కథానాయకుడిగా కె.శిరీషా రమణా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ . ఈ సినిమాను ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఎం.రమేష్, గోపి దర్శకత్వం వహించారు. ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష హీరోయిన్స్. సీనియర్ నటుడు వినోద్ కుమార్ విలన్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కు మంచి ఆదరణ లభించాయి.సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను సీనియర్ హీరో, విలక్షణ నటుడు శ్రీకాంత్ విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో హీరో రమణ్‌తో పాటు రద్శకులు రమేష్, గోపి పాల్గొన్నారు.ఈ సందర్భంగా...హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘దర్శకులు రమేష్, గోపిలతో మంచి అనుబంధం ఉంది. వారి కాంబోలో రూపొందిన చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ ట్రైలర్‌ను విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ఏప్రిల్ 8న విడుదలవుతున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను.అలాగే ఈ సినిమాతో హీరోగా, నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్న రమణ్‌కు సినిమా పెద్ద సక్సెస్ కావాలి. తను మరిన్ని మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూనిట్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని తెలిపారు.
హీరో రమణ్ మాట్లాడుతూ ‘‘నాకు హీరో శ్రీకాంత్‌గారంటే ఎంతో అభిమానం నేను హీరోగా చేసిన చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ ట్రైలర్ ఆయన చేతుల మీదుగా విడుదలవడం అనేది ఎంతో హ్యాపీగా ఉంది. దర్శకులు రమేష్, గోపి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించారు. ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
చిత్ర దర్శకులు రమేష్, గోపి మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి శ్రీకాంత్‌గారితో మంచి రిలేషన్ ఉంది. ఆయన మా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసి యూనిట్‌కు అభినందనలు తెలియజేసినందుకు ఆయనకు స్పెషల్ థాంక్స్. ఏప్రిల్ 8న సినిమా రిలీజ్ అవుతుంది’’ అన్నారు.
నటీనటులు:
రమణ్, ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష, వినోద్ కుమార్, రచ్చ రవి, మిర్చి మాధవి, జూనియర్ బాలకృష్ణ, శంకర్, కృష్ణ, ప్రకాష్ అడ్డా, వెంకట్, సిద్ధు తది తరులు
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: ఎం. రమేష్, గోపి
నిర్మాత: కె. శిరీషా రమణారెడ్డి
బ్యానర్: సిరి మూవీస్
సమర్పణ: కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి
రిలీజ్: స్క్రీన్ మ్యాక్స్ పిక్చర్స్
సంగీతం: మహిత్ నారాయణ్
బ్యాగ్రౌండ్ స్కోర్: శ్రీవసంత్
సినిమాటోగ్రఫీ: ఎ.కె. ఆనంద్
ఎడిటింగ్: శ్రీనివాస్ పి. బాబు, సంజీవరెడ్డి
ఆర్ట్: నరేష్ సిహెచ్.
ఫైట్స్: అల్టిమేట్ శివ, కుంగ్‌ఫూ చంద్రు
కొరియోగ్రఫీ: చందు రామ్, రాజ్ పైడి, సాయిశివాజీ
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







