భారత్-సౌదీ ఒప్పందాలు

- April 03, 2016 , by Maagulf
భారత్-సౌదీ ఒప్పందాలు

ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలో భాగంగా భారత్‌-సౌదీ అరేబియా దేశాల మధ్య పలు విషయాల్లో అవగాహనకు వచ్చి ఐదు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రధానంగా కార్మికులు,పెట్టుబడుల రంగంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. చేతివృత్తుల రంగంలో సహకారానికి, ఉగ్రవాదులకు ఆర్థిక సహకారంపై నిఘావర్గాల సమాచార మార్పిడిపై ఒప్పందం కుదిరింది.మనీలాండరింగ్‌ వ్యవహారంలో నిఘావర్గాల సమాచార మార్పిడిపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఇక మీదట ఇరు దేశాలు ఆయా విషయాల్లో పరస్పరం సహకరించుకోనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com