కొత్త మంత్రుల విషయంలో మనసు మార్చుకున్న ఏపీ సీఎం జగన్..
- April 08, 2022
అమరావతి: కొత్త మంత్రివర్గం విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. పాత మంత్రుల్లో కేవలం ముగ్గురు , నలుగుర్ని మాత్రమే తీసుకొని , మిగతా వారందర్ని కొత్తవారిని తీసుకోవాలని ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు గత మంత్రి వర్గంలో పని చేసిన 7 నుండి 11 మంది వరకు తీసుకోవాలని అనుకుంటున్నారట. సీనియారిటీకి చోటు కల్పించాలని ఆలోచన లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లు సమాచారం అందుతోంది.
సామాజిక సమతూకం, జిల్లా అవసరాల దృష్ట్యా మంత్రి పదవులు దక్కనున్నాయి. ముఖ్యంగా… అనుభవం కోటాలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరి వీరికి మరోసారి ఛాన్స్ దక్కుతుందా లేదా అనేది చూడాలి. నిన్న గురువారం 24 మంది మంత్రులు రాజీనామా చేసి , జగన్ కు అప్పగించారు. ఈరోజు ఆ రాజీనామా పత్రాలను గవర్నర్‌కు సమర్పించారు. ఈ నెల 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







