ఒక్క రోజులో షిర్డీ టూర్
- April 08, 2022
షిర్డీ: వేసవి సెలవులని దృష్టిలో పెట్టుకొని IRCTC ఎప్పటికప్పుడు ప్రజల కోసం వివిధ రకాల టూర్ ప్యాకేజీలను తీసుకువస్తూనే ఉంది. ఈ ప్యాకేజీలతో తక్కువ ఖర్చుతో మీరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సులభంగా పర్యటించవచ్చు.
తాజాగా షిర్డీ సాయి భక్తుల కోసం IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది.ఈ ప్యాకేజీలో ప్రయాణికుడు బయలుదేరినప్పటి నుంచి బస చేయడానికి, ఆహారం, పానీయాలకు అన్ని ఏర్పాట్లు ఉంటాయి. మీకు సెలవులు లేనప్పటికీ ఈ ప్యాకేజీని వినియోగించుకోవచ్చు. ఎందుకంటే తక్కువ రోజులే కాబట్టి. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
IRCTC ఢిల్లీ టు షిర్డీ ప్రత్యేక ప్యాకేజీ వివరాలు...
1. ఈ ప్యాకేజీలో ప్రయాణీకులు రాజధాని ఢిల్లీ నుంచి షిర్డీకి తరువాత షిర్డీ నుంచి ఢిల్లీకి వచ్చే సౌకర్యాన్ని పొందుతారు.
2. ఈ ప్యాకేజీలో మీరు షిర్డీలో పికప్, డ్రాప్ సౌకర్యం పొందుతారు.
3. ఈ ప్యాకేజీలో ప్రయాణికులందరికీ అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం వంటి సౌకర్యాలు లభిస్తాయి.
4. మీరు ఫ్లైట్ దిగిన తర్వాత ప్రయాణించడానికి AC కారు సౌకర్యం కూడా లభిస్తుంది.
IRCTC ఈ ప్యాకేజీని రెండు రోజుల పాటు షెడ్యూల్ చేసింది. మొదటిది 23 ఏప్రిల్ 2022. రెండోది 14 మే 2022. ఈ ప్యాకేజీ ప్రకారం ఏప్రిల్ 23న విమానంలో ఢిల్లీ నుంచి షిర్డీకి చేరుకుంటారు. అనంతరం విలాసవంతమైన హోటల్లో బస చేస్తారు. మధ్యాహ్న భోజనం తరువాత శని శింగనాపూర్ని సందర్శించవచ్చు. సాయంత్రం తిరిగి వచ్చి హోటల్లో బస చేయవచ్చు. ఉదయం షిర్డీకి వెళ్లి దర్శనానంతరం భోజనం చేసి విమానంలో ఢిల్లీకి తిరిగి వస్తారు.ఈ ప్యాకేజీలో భాగంగా సింగిల్ ప్యాసింజర్కి అయితే రూ. 16,970 చెల్లించాల్సి ఉంటుంది.ఇద్దరు ప్యాసింజర్లు అయితే ఒక్కో వ్యక్తికి రూ.15,960 చెల్లించాల్సి ఉంటుంది. ముగ్గురు ప్యాసింజర్లు అయితే ఒక్కో వ్యక్తి రూ.15,760 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజిని పొందేందుకు మీరు వెబ్సైట్ని సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







