జమ్ముకశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా మెహబూబా..
- April 03, 2016
జమ్ములోని రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు ఆమె ప్రమాణం చేస్తారు. దేశంలోనే రెండో ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా సైతం ఆమె రికార్డు సృష్టించనున్నారు. 87 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో పీడీపీ-భాజపా సంకీర్ణానికి 56 మంది సభ్యుల మద్దతుంది. వీరిలో 27 మంది పీడీపీ సభ్యులు కాగా.. 25 మంది భాజపా, ఇద్దరు పీపుల్స్ కాన్ఫెరెన్స్ నేతలు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు మెహబూబాతోపాటు 16 మంది కేబినెట్ మంత్రులు, ఎనిమిది మంది సహాయక మంత్రులు ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఇద్దరు భాజపా నేతలకు స్వతంత్ర మంత్రి పదవులు దక్కనున్నాయి. తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ చివరిసారి సీఎంగా పనిచేసిన సమయంలో మంత్రులుగా కొనసాగిన పార్టీ సభ్యులందరినీ మెహబూబా క్యాబినెట్‌లోకి తీసుకుంటున్నారు. కానీ భాజపా మంత్రి వర్గంలో మార్పులు జరుగనున్నాయి. మెహబూబా ప్రమాణం అనంతరం పీడీపీ, భాజపా సభ్యులు కలిసి 'భారత్ మాతా కీ జె'ైఅని నినదిస్తారని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫెరెన్స్ నాయకులు ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఈ నినాదం చేయని వారికి దేశంలో నివసించే హక్కులేదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ముస్లిం నిబంధనలకు ఈ నినాదం విరుద్ధమని, ఎవరూ దీన్ని పలకొద్దని దారుల్ ఉలూమ్ దేవ్‌బంది ముస్లిం సంస్థ ఫత్వా జారీచేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







